Magazines

మూడోసారి గౌడ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవం

1 గంట క్రితం

unanimously
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

మాసాపేట రాజుగౌడ్ కు సభ్యుల ఏకగ్రీవ మద్దతు

నవతెలంగాణ-ఆలేరు రూరల్

ఆలేరు మండలం కొలనుపాక గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా మాసాపేట రాజుగౌడ్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌడ సంఘం సభ్యులు, పెద్దల సమక్షంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గతంలో సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి రాజుగౌడ్ చేసిన సేవలను గుర్తించి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న గౌడ సంఘం సభ్యులకు రాజుగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఐక్యతకు కృషి చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్