ఎమ్మార్పీఎస్ నాయకులు యాదవ్ సూర్య వంశీ మాదిగ
నవతెలంగాణ-మద్నూర్
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ప్రజాసేవకోసం స్వచ్చందంగా మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామని బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు, యాదవ్ సూర్యవంశీ మాదిగ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సొంత నిధులతో సెవెన్‌హిల్స్ భాన్సువాడ వైద్య బృందంతో ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు అవసరమైన మందులు అందిస్తామని తెలిపారు. ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.







కామెంట్‌లు (0)