Magazines

పెన్షన్ లబ్ధిదారుల వివరాల ప‌రిశీల‌న

40 నిమిషాల క్రితం

Pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నలబ్ధిదారుల అర్హతను నిర్ధారించేందుకు మంగళవారం భీంగల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏ పి ఓ జి. నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి భూమేశ్వర్ నేతృత్వంలో అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, అవసరమైన పత్రాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ పథకం ప్రయోజనాలు అందేలా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్