Magazines

25 రోజులకే..గ్యాస్ బుకింగ్.!

52 నిమిషాల క్రితం

gas
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

మండలంలో 5974 కనెక్షన్లు

నవతెలంగాణ-మల్హర్ రావు

అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్ రీఫిల్ బుకింగ్ పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో పట్టణ, గ్రామీణ వినియోగదారులు పొదుపుగా గ్యాస్ ను వినియోగిస్తున్నారు. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, మరొక దాని కోసం పట్టణ ప్రాంతాల వారు 35 రోజుల తర్వాత, గ్రామీణ ప్రాంతాల వారు 45 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవడానికి పరిమితి విధించారు. తాజాగా కేంద్రం 25 రోజులకే గ్యాస్ బుక్ చేయడానికి అవకాశం కల్పించింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఆదా..

 30-35 రోజులకు ఒకసారి ఖాళీ అయ్యే సిలిండర్ ను 45-50 రోజుల వరకు పొదుపుగా వాడుకున్నారు. చాలా మంది కట్టెలు, ఎలక్ట్రిక్ పొయ్యిలను ఉపయోగించి గ్యాస్ ను ఆదా చేస్తున్నారు. తాజాగా కేంద్రం ఆంక్షలు సడలించడంతో మళ్లీ 25 రోజుల వ్యవధిలోనే సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం రావడంతో వినియోగ దారులకు ఊరట లభించినట్లు అయింది. మండల కేంద్రమైన తాడిచెర్లలో సుశ్రుత ఇండియన్ గ్యాస్ ఏజన్సీ ఉంది. ఇందులో 5,974 కనెక్షన్లు ఉన్నాయి. యుద్ధ కాలం నాటి నుంచి కొత్త గ్యాస్ కనెక్షన్లను జారీ చేస్తే వందలాది మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుందోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్