Magazines

యుపీలో మైనర్లతో అభ్యంతరకర, రాజకీయ వీడియోలు

1 గంట క్రితం

యుపీలో మైనర్లతో అభ్యంతరకర,  రాజకీయ వీడియోలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం

ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీ ఆగ్రహం.. కేంద్రం, మెటా, ఎతాహ్‌ జిల్లా అధికారులకు నోటీసులు
న్యూఢిల్లీ : సీ్తరప్రదేశ్‌‌లో ఎతాహ్‌ ‌జిల్లాలో మైనర్లను వేధింపులకు గురిచేస్తూ, వారితో బలవంతంగా అభ్యంతరకర, రాజ కీయ వీడియోలు రూపొందిస్తున్న ఘటనలపై జాతీ య మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్‌ ఆర్‌‌సి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఎలక్ట్రా నిక్స్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎతాహ్‌ జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలను నివారిం చడానికి తీసు కున్న చర్యల వివరాలతో రెండు వారాల్లోగా నివేదికను అంద చేయాలని నోటీ సుల్లో ఆదేశించింది. వేధింపులకు గురైన పిల్లలను గుర్తించి, వారికి రక్షణ, కౌన్సెలింగ్, పునరావాస చర్యలు అందేలా చూడాలని ఎతాహ్‌ ‌జిల్లా కలెక్టర్‌‌ను ఆదేశించింది. ఇలాంటి వీడి యోలను రూపొందించడం, రికార్డ్‌ ‌చేయడం, అప్‌లోడ్ చేయడం, వ్యాప్తి చేయడం.. వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయా లని జిల్లా ఎతాహ్‌ ఎస్‌‌పిని ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సి ఆదేశించింది. ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ అయిన మెటాను.. ఈ వీడియోలు ఎలా అప్‌లోడ్ అవు తున్నాయో,, వ్యాప్తి చెందుతున్నాయనో పరిశీలించి, పరిష్కరిం చడానికి ఎలాంటి చర్య లు తీసుకున్నారో వెల్లడించాలని ఆదేశించింది. అలాగే, ఇలాంటి వీడియోలు సోషల్‌ ‌మీడియాలో ప్రవేశించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, దీనికి ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారో తెలపాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఎన్‌హెచ్‌ఆర్‌‌సిని ఆదేశించింది. యుపిలోని ఎతాహ్‌ జిల్లాలో మైనర్లతో అభ్యంతరక, రాజకీయ వీడియోలను బలవంతంగా, పదేపదే రూపొందించి, సోషల్‌ ‌మీడియాలో వ్యాప్తి చేస్తున్నారనే ఫిర్యాదుపై ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌సి బెంచ్ ఈ నోటీసులు జారీ చేసింది. సేవా న్యాయ ఉత్థాన్ ఫౌండేషన్ చేసిన ఫిర్యాదు ప్రకారం... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు చెందిన మైనర్లతో ఇలాంటి వీడియోలను రూపొందిస్తున్నారు. వీడియోల్లో మైనర్ల చేత దూషణాత్మక, అవమానకరమైన, రాజకీయ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలను డిజిటల్ మాధ్యమాలలో అప్‌‌లోడ్‌ ‌చేసిన విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్