Magazines

స్థానికం’లో సత్తా చాటాలి

1 గంట క్రితం

Must prove mettle at the local level.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

ముఖ్య నాయకులతో కల్వకుంట్ల కవిత సమావేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాబోయే స్థానిక సంస్థలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటేలా తగిన విధంగా సిద్ధం కావాలని పార్టీ కేడర్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రానున్న కాలంలో పార్టీ నేతలు, క్యాడర్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమైన ఆమె సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లు, సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పోటీ చేసి సత్తా చాటాలని నేతలకు సూచిం చారు. నిజామాబాద్, కొడంగల్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ లకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో అడిగి తెలుసు కున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారో ఆ దిశలోనే పయనిద్దామని సూచించారు. ​
మన పోరాటాలతోనే ప్రభుత్వంలో కదలిక
ప్రతిపక్షంగా టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలతోనే ప్రభుత్వంలో కదలిక వస్తుందని కవిత చెప్పారు. ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనలో తెలంగాణ రక్షణ సేన స్పందించిన తీరుతోనే ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. ఏండ్లకేండ్లుగా రిమ్స్ హాస్పిటల్ ను పట్టించుకోని ప్రభుత్వం తక్షణ చర్యల కోసం రూ.11 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. రిమ్స్ హాస్పిటల్ సమస్యలపై సమీక్షించి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. తాను ఆస్పత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన తర్వాతనే ప్రభుత్వం దిగివచ్చి మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందన్నారు.
బుధవారం వరకు సమావేశాలు
ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలు బుధవారం వరకు కొనసాగనున్నాయి. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ, బుధవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో కవిత సమావేశం కానున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్