Magazines

లింగంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద 23 కిలోల గంజాయి పట్టివేత

2 గంటల క్రితం

23 kg of marijuana seized at Lingampalli railway station
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–హైదరాబాద్‌: లింగంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని తనిఖీ చేయగా.. వారి వద్ద నుంచి సుమారు 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పట్టుబడిన వారిని ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్‌, రషీద్‌గా గుర్తించారు. విచారణలో వారు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్