నవతెలంగాణ–హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు అమితాబ్ కాలు జారి కిందపడటంతో మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో షూటింగ్ సెట్‌లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వెంటనే సిబ్బంది, వైద్యులు అప్రమత్తమై ఆయనకు చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.







కామెంట్‌లు (0)