Magazines

గుజరాత్ లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

1 గంట క్రితం

Congress protests
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను ఉధృతం చేస్తోంది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల కార్యాలయాల వద్ద పెద్ద యోత్తున నిరసన చేపడుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. జ్ఞానేష్ కుమార్ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వెంటనే ప్రధాన కమిషనర్ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.


ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఏకపక్షంగా తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల అమలుపై ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.



Gujarat Congress workers protesting in Ahmedabad (Photo/ANI)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్