Magazines

పైలట్ స్మిత్ ధైర్యానికి నా సెల్యూట్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

2 గంటల క్రితం

President Draupadi Murmu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగా - హైదరాబాద్ : ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. స్మిత్ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి అందరినీ కదిలించాయని, గాయపడినా ఇతరులను కాపాడాలనే ఆయన సంకల్పం చెక్కుచెదరలేదని ప్రశంసించారు. స్మిత్ శౌర్యం, తక్షణ స్పందన ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడాయని, ఆయన ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. స్మిత్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
పైలట్ స్మిత్ ఫ్యామిలీతో మాట్లాడిన ప్రధాని

ఫ్లై దుబాయ్‌ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడిన స్మిత్‌ ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు. కుటుంబానికి భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు స్మిత్‌ను ‘హీరో’గా అభివర్ణిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడి సౌదీలో చికిత్స పొందుతున్న స్మిత్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్