నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల సంఘం (ఈసీ) తీరును నిరసిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జైల్ భరో ఆందోళన’ను చేపట్టనున్నట్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. బుధవారం ముంబయి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ పనితీరు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని మండిపడ్డారు. ఈసీ తీరుకు విమర్శిస్తూ గాంధీ జయంతి రోజున ముంబయిలోని శివాజీ పార్క్ నుండి "జైల్ భరో ఆందోళన"ను చేపట్టనున్నామని, అక్టోబర్ 2న శివాజీ పార్క్ నుండి ఈ నిరసన ప్రారంభమవుతుందని అన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసీ"నిరంకుశ ధోరణి" ఆందోళనకరమైన అంశమని, దేశంలో మార్పు తీసుకురావడానికి సమిష్టి కృషి అవసరమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎఐ దుర్వినియోగంపై ఎన్‌సిపి(ఎస్‌పి) అధ్యక్షుడు శరద్‌పవార్ చేసిన వ్యాఖ్యలకు దీప్కే మద్దతు ప్రకటించారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని పునరుద్ఘాటించారు. ఎస్‌ఐఆర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.







కామెంట్‌లు (0)