Magazines

ఫహాద్ ఫాజిల్ నటనకు మహేశ్ బాబు ఫిదా

6 గంటల క్రితం

Mahesh Babu praises Fahadh Faazil's performance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా విడుదలకు ముందు మహేశ్ బాబు నుంచి వచ్చిన రివ్యూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మహేశ్ బాబు సినిమాను ఒక కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌గా అభివర్ణిస్తూ, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, కంటెంట్ అన్నీ బాగా కుదిరాయని ప్రశంసించారు. ఫహాద్ ఫాజిల్, చిన్నారి సారా నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దర్శకుడు శశాంక్ యేలేటిని, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయను కూడా మహేశ్ అభినందించారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు బాలకృష్ణ, ఎన్టీఆర్ తర్వాత మహేశ్ బాబు నుంచి వచ్చిన ఈ మద్దతు ప్రచారానికి మంచి ఊపునిచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్