నవతెలంగాణ - హైదరాబాద్: పండుగ సీజన్‌లో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, టీవీల కొనుగోలు మరింత భారంగా మారనుంది. రాగి, అల్యూమినియం, ఉక్కు, ప్లాస్టిక్ వంటి ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి ధరలను 2-10 శాతం వరకు పెంచనున్నాయి. ఈ ఏడాది ధరల పెంపు ఇది మూడోసారి.ఏసీల ధరలు ఇప్పటికే 5-8 శాతం పెరగగా, డైకిన్ 8-10 శాతం వరకు ధరలు సవరించింది. హైయర్ అక్టోబర్ నుంచి జనవరి మధ్య దశలవారీగా 15 శాతం వరకు ధరలు పెంచే యోచనలో ఉంది. టీవీల ధరలు కూడా 7 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఉన్న పాత స్టాక్ కారణంగా దీపావళి వరకు కొన్ని ఉత్పత్తులు పాత ధరలకే లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త ధరలు పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
పండుగ సీజన్‌లో గృహోపకరణాల ధరలు పెంపు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)