Magazines

జింబాబ్వేలో హెలికాప్టర్‌ కుప్పకూలి ఏడుగురు మృతి

2 గంటల క్రితం

Seven dead in helicopter crash in Zimbabwe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–హైదరాబాద్‌: జింబాబ్వేలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య మారోండెరా గ్రామీణ ప్రాంతంలో బుధవారం ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త, నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో కలిపి మొత్తం ఏడుగురు మృతిచెందినట్లు ప్రభుత్వ ప్రతినిధి నిక్‌ మంగ్వానా తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని మంగ్వానా వెల్లడించారు. అయితే హెలికాప్టర్‌లో ఉన్నవారి సంఖ్యపై పోలీసుల ప్రకటనకు, ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించిన వివరాలకు పొంతన లేకపోవడం గమనార్హం. దీంతో మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్