Magazines

వ్యాపారం చేస్తే తప్పేంటి: కేటీఆర్

1 గంట క్రితం

brs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు హోటళ్లు ఉన్నాయంటూ.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సభ పెడుతున్నదంటే ఆత్మహత్య చేసుకున్న నేతన్నల గురించి మాట్లాడి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తాడేమో అనుకుంటే.. అక్కడ కూడా తమపై బురద చల్లడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మాత్రం సిరిసిల్లకు వెళ్లడం ఎందుకు..? హైదరాబాద్ లోనే సమావేశం పెడితే సరిపోతుందని కదా అని అన్నారు. 

హైదరాబాద్ సిటీలో మూడు హోటళ్లు ఉన్నాయని.. వ్యాపారం చేస్తే తప్పేంటనీ ప్రశ్నించారు కేటీఆర్. 1999లోనే ఒక హోటల్ పెట్టామని.. అది ఇప్పుడు మూడు హోటళ్లు అయ్యాయయని.. వ్యాపారాలు చేయకూడదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్