Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయుల అవగాహన 

ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయుల అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
ప్రాథమిక విద్యలో “ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి” (ఎఫ్ ఎల్ ఎన్) ప్రాధాన్యతను తెలియజేస్తూ బుధవారం మండల కేంద్రంలో ఉపాధ్యాయులు వినూత్నంగా “ఎఫ్ ఎల్ ఎన్” అక్షరాల ఆకారంలో కూర్చొని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి చిన్నారిలో చదవడం,రాయడం,ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడమే” ఎస్ ఎల్ ఎన్” ప్రధాన లక్ష్యం అన్నారు.

ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు పటిష్టమైన విద్య పునాది కల్పించేందుకు ఉపాధ్యాయుల శిక్షణ,వినూత్న బోధన పద్ధతులు,ఆటలు,కథలు,కార్యకలాపాల ఆధారిత అభ్యసనం ఎంతో కీలకమని విద్యాశాఖ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు “ఎఫ్ ఎల్ ఎన్” ప్రతి చిన్నారి అభ్యసనానికి బలమైన పునాది”,“చదువు,రాత,గణితం ప్రతి బిడ్డ హక్కు” అనే సందేశాన్ని చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జి.శారద,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయురాలు మాలతి,రిసోర్స్ పర్సన్స్ ఉదావత్ లచ్చిరాం,బాల్తి రజినీకాంత్,వెంకటేశ్వర్లు,ప్రధానోపాధ్యాయులు ఐతరాజు నాగయ్య,అల్వాల్ రెడ్డి,రాజేశ్వరి,స్వరాజ్యం,లక్ష్మి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -