•ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మర్రిగూడ
పాలిటెక్నిక్ కళాశాలలను”శక్తి శాఖ”లో విలీనం చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వీర్యం చేసే కుట్రను ప్రభుత్వం వెంటనే విరమించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని ఖుదాభక్షపల్లి గ్రామంలో ఎరజాల జగన్నాథం అధ్యక్షతన జరిగిన గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు.పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను విద్యాశాఖ లోనే కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూడాలన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో ఆయా శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని,స్థానిక పరిశ్రమలలో యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో జరుగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నవీన్,సిపిఐ మండల కన్వీనర్ బుర్ర శేఖర్,ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు గుణముని సాయికుమార్,శ్రీకాంత్,జి పవన్,జి నాగరాజు,ఐ కార్తీక్,గోపాలకృష్ణ,జయంత్,దినేష్,రమేష్,శివ,నాగరాజు పవన్,తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వీర్యం చేసే కుట్రను ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



