కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ముందు రేవంత్ రెడ్డి సర్కారు మోకరిల్లిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత కరెంట్ ను ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన పవర్ ఎక్స్ పో – 2026ను సందర్శించి అక్కడ ప్రదర్శనకు ఉంచిన స్మార్ట్ మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్ ను దూరం చేయడంతో పాటు లాండ్రీ షాపులు, సెలూన్లకు ఉచిత కరెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకంలో భాగంగానే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అదానీకి లాభం చేయడానికి కేంద్రం స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెడుతుంటే రేవంత్ సర్కారు దానికి వంత పాడుతోందన్నారు.
దీనిపై ప్రజల మైండ్ వాష్ చేసేందుకే పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన ఏర్పాటు చేసిందన్నారు. యూపీలో స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఆగ్రహంతో వాటిని తొలగించి కరెంట్ ఆఫీసుల్లో పడేసి వెళ్తున్నారని చెప్పారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని, ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
అవినీతికి మూలకారకుల సంగతేంది?
గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి రూ.వేల కోట్లు కొల్లగొట్టిన అధికారుల గుట్టును ఏసీబీని ఉపయోగించి బయట పెడుతున్న ప్రభుత్వం ఆ అవినీతికి మూల కారకుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. ఈమేరకు ఎక్స్ (ట్విట్టర్)లో సోమవారం పోస్ట్ పెట్టారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు వందలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకోవడానికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న వారి సంగతి ఏమిటని ప్రశ్నించారు.
‘ప్రీపెయిడ్ మీటర్ల’ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



