Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద విద్యార్థుల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.

పేద విద్యార్థుల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.

- Advertisement -

హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం
మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
నవ తెలంగాణ-మల్హర్ రావు(మంథని): పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో విద్యతోపాటు వారి ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో హరేకృష్ణ ట్రస్ట్ సెంట్రలైజ్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిచెన్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,పాండేషన్ ప్రెసిడెంట్ శ్రీసత్య గౌర చంద్ర దాస స్వామీజీతో కలిసి. ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు 19 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు ఉదయం పూట బలవర్తకమైన అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు.పెద్దపెల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 694 ప్రభుత్వ పాఠశాలలు,17 జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.పేద విద్యార్థులకు ప్రభుత్వం హరే కృష్ణ ట్రస్ట్ సంయుక్తంగా బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకుని తమ మేధాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు.మొదట కొడంగల్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు మంథని ప్రారంభం కాగా,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ పాఠశాలలో చదివి పేద విద్యార్థుల కోసం, వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలో చేరి బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,మంథని మున్సిపల్ చైర్మన్. వైస్ చైర్మన్ కౌన్సిలర్స్,ప్రజాప్రతినిధులు,అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -