మండల విద్యాధికారి విజయ్ కుమార్
నవతెలంగాణ-కుభీర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నడిపించేందుకు కృషి చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింతగా పెంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి విజయ్ కుమార్ సూచించారు. శనివారం మండలంలోని బాకోట్, జంగావ్ గ్రామాల్లో ఉన్న పాఠశాలను పరిశీలించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా చూడలని అన్నారు. అదే విదంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, విద్యతో పాటు నాణ్యమైన భోజన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. దింతో ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించి ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎంతో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు విద్య బోధన అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పాలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. పాఠశాలకు సంబదించిన పాలు రికార్డులు తనిఖీ చేశారు. ఆయన వెంట ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



