Sunday, July 26, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్మారిన దొంగ

మారిన దొంగ

- Advertisement -

వీరాపురం అనే గ్రామంలో జగ్గయ్య అనే అతను నివసించేవాడు చిన్న చిన్న దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు ఎవరూ లేని సమయంలో ఇళ్ళల్లోకి దూరి బంగారు నగదు దొంగలించేవాడు. దొంగలించిన సొమ్ముతో జల్సాగా తిరిగేవాడు. స్నేహితులు ఎంత చెప్పినా వినేవాడు కాదు ఇలా కాలం గడుపుతూ వచ్చాడు.
ఒకరోజు రాత్రి దొంగతనానికి వెళ్ళాడు, ఒక ఇంటి తాళం పగులగొట్టి ఆ ఇంట్లో వున్న సొమ్మంతా దొంగలించాడు. తను దొంగలించిన సొమ్మంతా ఒక పూరి గుడిసెలో ఎవరికీ తెలియకుండా దాచుకునేవాడు ఇలా కొద్ది రోజులు జరిగిపోయింది.
ఒకరోజు రాత్రి.. దగ్గరలో గల పొలం గట్టుకు పెట్టిన నిప్పు వలన ఊరికి అనుకుని వున్న గుడిసెలకు వ్యాపించాయి ఖాళీ గుడిసెలు కావడంచేత ప్రాణ నష్టం జరుగలేదు. ఆ గుడిసెల్లోనే జగ్గయ్య దొంగతనం చేసిన సొమ్ము దాచుకుంటున్న గుడిసె కూడా వుంది అది పూర్తిగా కాలి పోయింది. దాచుకున్న ధనమంతా బూడిదపాలైంది.
అది చూసి జగ్గయ్య బోరున విలపించాడు. తన స్నేహితుడు రాముజగ్గయ్య దగ్గరకు వచ్చి గట్టిగా నవ్వేసాడు ”సొమ్ము పోగొట్టుకుని నేను బాధలో వుంటే నీకు నవ్వు వస్తోందా ఇదేనా స్నేహమంటే” అన్నాడు జగ్గయ్య
”ఓ మిత్రమా! దొంగలించిన సొమ్ము పోయినందుకే ఇంత బాధ పడుతున్నావే. ఆ సొమ్ము సంపాదించిన వారు ఇంకెంత బాధ పడి వుంటారో అర్థం చేసుకో ఆ బాధ నొప్పి నీ వరకు వస్తేగాని నీకు అర్థం కాలేదు ఇలా చేయడం తప్పు పరాయి సొమ్ము ఆశించడం మానవత్వం అనిపించుకోదు ఆ సొమ్ము నిలబడదు,ఈ దొంగతనాలు మానెరు” అన్నాడు రాముడు జగ్గయ్య బాగా ఆలోచించాడు
”కష్టపడి సంపాదించడం నేర్చుకో తప్పుడు పని ఎప్పటికైనా గుణపాఠం అవుతుంది దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు బాగా ఆలోచించు మిత్రమా” అన్నాడు రాముడు.
”నన్ను క్షమించు రాముడు! ఇంకెప్పుడూ దొంగతనం చేయను ఇంకొకరిని బాధ పెట్టను” అంటూ పశ్చాత్తాపం చెందాడు జగ్గయ్య.

నరెద్దుల రాజారెడ్డి, 9666016636

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -