Saturday, August 15, 2026
E-PAPER
Homeమానవిపిల్లలకు ఇవి చెప్పాలి

పిల్లలకు ఇవి చెప్పాలి

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు, ఈ నెలలో ఒక్క రాఖీ పండుగకు తప్ప దేనికీ సెలవు లేదన్నావు. ఉత్తర భారత దేశంలో రాఖీ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది నాన్న. ఈ పండగకు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా సోదరి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని, ఆశీర్వదించి కట్న కానుకలు ఇచ్చి వెళ్తారు. సరే ఇక అసలు విషయానికి వస్తున్న, మళ్ళీ ఒక సారి వెనక్కి అంటే బాల్యంలోకి వెళ్లాల్సి వస్తోంది నాన్న. ఎందుకంటే రెండు రోజుల కిందట నాలుగైదేండ్ల బాబు మన అపార్ట్ మెంటు కింద కూర్చిని మొబైల్‌తో ఆడుకుంటున్నాడు. ఆ బాబును నేను ఎప్పుడూ చూడలేదని దగ్గరకు వెళ్లి పలకరించి ‘ఎవరింటికి వచ్చావు’ అన్నాను. తెలియదు అన్నాడు, ఫ్లాట్ నెంబర్ ఎంత, ఎన్నో ఫ్లోర్ అని అడిగా, తెలియదు అన్నాడు. ఏది అడిగిన ఇదే సమాధానం. అప్పుడు నాకు అనిపించింది. పిల్లలకు అత్యంత ముఖ్యమైన విషయాలు, జాగ్రత్తలు చెప్పాలని. పిల్లలకు మాటలు వస్తున్నప్పుడు తల్లి తండ్రుల పేర్లు, ఇల్లు ఎక్కడుందో ప్రాంతం, గుర్తులు చెప్పాలి.

ఎవరింటికైనా వెళ్తుంటే వాళ్ల గురించి చెప్పాలి. అంతగా పిల్లలు గుర్తు పెట్టుకోలేరు అనిపిస్తే ఒక ఫోన్ నెంబర్ వారికి చెప్పాలి. వాళ్లకు మనం చెబుతున్నవి అర్ధం అవుతున్నాయి అని తెలినప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, ఇంటికి వెళ్లే దారిలో కొన్ని గుర్తులు దారిలో నడిపిస్తూ చెప్పాలి. ఎక్కడైనా పిల్లలు తప్పి పోయి ఏడుస్తుంటే చూసిన వాళ్ళు వివరాలు అడుగుతుంటారు. అలాగని పిల్లలను వదిలేయమని కాదు, జాగ్రత్తలు చెప్పడం చాలా అవసరం కూడా. నీకు మాటలు వస్తున్నప్పుడు అమ్మా, నాన్నల పేర్లు, ఫోన్ నెంబర్ చెప్పి మూడు నాలుగు రోజులకొకసరి ఆడిగేదాన్ని. మర్చి పోకుండా చెప్పేదానివి, అప్పుడు బంధువులు పేర్లు చెప్పేదాన్ని. ఎప్పుడు వసపిట్టలా వాగుతూ ఉండేదానివి. ఇప్పుడు మాట్లాడటమే అపురూపం అయిపోయింది. సరే నాన్న ఉంటాను. వచ్చే ఉత్తరంలో కూడా పిల్లల గురించే కొన్ని విషయాలు చెప్తాను..

ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -