Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుకిరువైపులా కంపచెట్లను తొలగించాలి

రోడ్డుకిరువైపులా కంపచెట్లను తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి
మండల పరిధిలోని నసనూరు-చిన్న ధన్వాడకు వెళ్లే సింగిల్ రోడుకు ఇరువైపులా కంపచెట్లు అధికంగా పెరిగాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అక్కడక్కడ కంపచెట్లు రోడ్డు పైకి రావడంతో బస్సులు, లారీలు వచ్చినప్పుడు సైడ్ ఇచ్చే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు కంపచెట్ల గీసుకొని అనేకమంది గాయాల పాలవుతున్నారు. వెంటనే నసనూరు గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి రోడ్డుకిరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించి, ప్రయాణాన్ని సుగమం చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -