Sunday, August 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘టాక్సిక్‌’పాత్ బ్రేకింగ్ సినిమా

‘టాక్సిక్‌’పాత్ బ్రేకింగ్ సినిమా

- Advertisement -

యశ్ నటించిన మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లీష్‌, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో ఈనెల 26న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యశ్ మాట్లాడుతూ, ‘మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడాలి. మనందరం కలిసి ఇండియన్ సినిమాను గ్లోబల్ సినిమాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలి. ఈ సినిమా గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాకు ఇండియా నుంచి బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేశారు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఆడియన్స్‌కు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాం’ అని తెలిపారు.

‘ఈ సినిమాను చాలా పెద్ద విజన్‌తో, బోల్డ్ డ్రీమ్‌తో, చాలా బ్యూటిఫుల్‌గా నిర్మించాం. మేము ఎంత జాగ్రత్త తీసుకున్నామో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపించి ఉంటుంది. ‘టాక్సిక్’ సినిమా ప్రేక్షకులకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్, ఒక గ్రేట్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది. టాక్సిక్’ మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే కాదు, ఎక్సైట్ చేయడమే కాదు.. మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది’ అని నిర్మాత కేవీఎన్ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ,’‘కేజీఎఫ్’ తర్వాత ఎవరైనా ఇంకా పెద్దగా ఆలోచిస్తారు. కానీ యశ్ మాత్రం ఒక కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ, కథలో ఉన్న బలాన్ని నమ్మి ‘టాక్సిక్’ సినిమా చేశారు. ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలనే ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -