Sunday, August 23, 2026
E-PAPER
Homeఆటలుఅష్రఫ్‌ గన్యానీకి రెండు మెడల్స్‌

అష్రఫ్‌ గన్యానీకి రెండు మెడల్స్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
రైఫిల్‌ ప్రోన్‌ బిగ్‌బోర్‌ షూటింగ్‌ గ్రాండ్‌ ప్రీ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ షూటర్‌ మహ్మద్‌ అష్రఫ్‌ గన్యానీ రెండు పతకాలతో మెరిశాడు. అక్టోపస్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన 300 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ మెన్స్‌ వ్యక్తిగత విభాగంలో అష్రఫ్‌ 273/300 స్కోరు సాధించాడు. రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ అందుకున్న అష్రఫ్‌.. అదే వేదికపై జరిగిన రెండవ తెలంగాణ స్టేట్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో 300మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నాడు. రెండు మెడల్స్‌తో సత్తా చాటిన అష్రఫ్‌ను తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌ సంఘీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -