- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని గంగ్ శెట్టి హనుమాన్ ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మహరాజ్, మహేశ్ మహరాజ్, వేదమంత్రోచ్చరణలతో పూజలు, వరలక్ష్మి వ్రత కథ, అష్టోత్తరం చేపట్టారు. హరతీ అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. గత ముప్ఫై ఏళ్లుగా వరలక్ష్మి వ్రతాలు చేపడుతున్నట్లు నిర్వహకులు కృష్ణ గౌడ్, గంపల్ గంగాధర్ తెలిపారు. వరలక్ష్మి పూజల్లో ప్రత్యేకంగా మహిళలు పాల్గొనడం ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
- Advertisement -



