Tuesday, August 25, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రారంభాలకు నోచుకోని పల్లె దవాఖానాలు

ప్రారంభాలకు నోచుకోని పల్లె దవాఖానాలు

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి
మండల కేంద్రంతో పాటు పెద్ద తాండ్రపాడు, మాన్ దొడ్డి గ్రామాలలో నాలుగు పల్లె దవాఖానాల నిర్మాణం పూర్తై మూడేండ్లు గడుస్తున్నా.. స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. గ్రామాల్లోని ప్రజలకు అర్ధరాత్రివేళ అత్యవసర వైద్య సేవలు అందాల్సి వస్తే రాజోలికి లేదా కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లోని గుంతల రోడ్లపై ఆస్పత్రికి చేరేలోపే చాలా ప్రాణాలు మద్యలోనే ఆగిపోతున్నాయి. మరోవైపు పల్లె దవాఖానాల్లో పిచ్చిమొక్కలు, కంపచెట్లు మొలిచి, మందు బాబులకు అడ్డాగా మారాయి. ప్రజల ఆరోగ్య క్ష‍ేమంకోసం ప్రభుత్వం లక్ష‍లు వెచ్చించి కట్టిన వైద్యారోగ్య భవనాలు శిథిలావస్థకు చేరకముందే వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులను గ్రామీణ ప్రజానీకం వేడుకుంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -