Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంపీవోకేలో హింసాత్మక ఆందోళనలు.. 19 మంది మృతి

పీవోకేలో హింసాత్మక ఆందోళనలు.. 19 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పీవోకేలో హింసాత్మక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులపై పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో ఏడుగురు మహిళలు సహా మొత్తం 19 మంది మృతిచెందినట్లు సమాచారం. స్థానిక చట్టసభ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. పీవోకేలో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ను పాకిస్థాన్‌కు తరలిస్తూ, స్థానిక ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులు మోపుతున్నారనే ఆరోపణలతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -