Tuesday, July 7, 2026
E-PAPER
HomeజాతీయంWayanad landslide: పెరిగిన మృతుల సంఖ్య

Wayanad landslide: పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ :కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి గ్రామ పంచాయతీ పరిధిలోని కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో మంగళవారం కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత గల్లంతైన మరో ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ప్రకారం.. కల్లాడి-అనక్కంపొయిల్ సొరంగం నిర్మాణ స్థలంలోని మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది అందులో చిక్కుకున్నారు. దీంతో మెప్పాడి-చూరల్మల రహదారిపై రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. వీరిలో గాయపడిన తొమ్మిది మందిని చికిత్స కోసం మెప్పాడి విమ్స్ ఆసుపత్రికి తరలించగా, గల్లంతైన మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -