రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-కొంపల్లి
పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. బుధవారం ‘గ్లోబల్ టైగర్ డే’ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమీ ఆధ్వర్యంలో డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పులుల సంరక్షణ, ఆరోగ్యకరమైన అడవులు.. జీవ వైవిధ్యానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణను పులులకు సురక్షితమైన ఆవాసంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నారని తెలిపారు. ‘పులులను రక్షిద్దాం.. అడవులను కాపాడుదాం.. మన భవిష్యత్తును పరిరక్షించుకుందాం’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పులిని సంరక్షించడం అంటే అడవులు, పర్యావరణం, జీవవై విధ్యం, భావితరాల భవిష్యత్తును కాపాడట మేనని అన్నారు. వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా కారణంగా పులుల సంఖ్య తగ్గిపోయిందని, పులుల సంరక్షణకు గతంలో చేపట్టిన చర్యల ఫలితంగా భారత్ ప్రపంచ పులుల సంరక్షణలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అమ్రాబాద్‌లో నీటి వనరులు, ఆవాసాల అభివృద్ధి, ఆధునిక రక్షణ చర్యలతో పులుల సంఖ్య పెరిగిందన్నారు. కవ్వాల్‌లో పులుల సంఖ్యను పెంచేందుకు టైగర్ రీ ఇంట్రడక్షన్ కార్యక్రమం చేపట్టి నట్టు తెలిపారు. అటవీ సంపదను పరిరక్షిం చేందుకు నిబద్ధత, నిజాయితీ, సేవా భావంతో పనిచేసి భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలని ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర ్థులకు మంత్రి సూచించారు. అనంతరం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. అకాడమీ.. ప్రథమ శ్రేణి అటవీ సిబ్బందికి సామర్థ్య పెంపు శిక్షణతో పాటు వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన, శిక్షణా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించేందుకు అకాడమీ కట్టుబడి ఉందని చెప్పారు. కాగా. ‘గ్లోబల్ టైగర్ డే’ సందర్బంగా వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. అలాగే పులుల సంరక్షణపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి వినయ్ కుమార్, కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వ విద్యాలయం వీసీ డా. దండ రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (డెవలప్‌మెంట్) డా. ఆర్. రత్నాకర్ జౌహరి, ఇతర అటవీ శాఖ ఉన్న తాధికారులు, ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థులు, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్య ర్థులు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ అకాడమీ ఆధ్వర్యంలో గ్లోబల్ టైగర్ డే
పులుల సంరక్షణలో భాగస్వాములు కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



