కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణగౌడ్
నవతెలంగాణ – ములుగు
కల్లుగీత చైతన్య రణబేరి పోరు ‘బస్సు యాత్ర స్ఫూర్తి’తో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణగౌడ్ అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహించే రాష్ట్ర చైతన్య బస్సు యాత్రలో భాగంగా సోమవారం ములుగు జిల్లాకు చేరుకుంది. స్థానిక డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి 400మంది కల్లుగీత కార్మికులతో కలిసి తంగేడు గ్రౌండ్ లోని రైతు వేదిక కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలో సంఘం జిల్లా అధ్యక్షులు గుండబోయిన రవిగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎంవీ రమణగౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల కిందట ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.20కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని అన్నారు. ఏజెన్సీ ఏరియాలో రద్దైన సొసైటీలను పునరుద్ధిరించాలని కోరారు. వృత్తి పింఛన్ అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే బస్సు యాత్ర స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఇంచర్ల సర్పంచ్ ముసినిపల్లి కుమార్‌గౌడ్, ములుగు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ ఉయ్యాల మధుకర్‌గౌడ్, జిల్లా గౌరవాధ్యక్షులు పులి నరసయ్యగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు రంగు సత్యనారాయణగౌడ్, గాజుల ఈశ్వర్‌గౌడ్, పులి రమేష్‌గౌడ్, లోడే శ్రీనివాస్‌గౌడ్, నక్క యాకయ్యగౌడ్, పాలకుర్తి శ్రీధర్‌గౌడ్, తాటి లచ్చులు గౌడ్, తిర్రి సంపత్ గౌడ్ వత్సవాయి సారయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



