Tuesday, August 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

- Advertisement -

త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు
ఎలక్ట్రిక్ ఆటోలను
 ఆర్టీసీ నడపదు :
రవాణా శాఖ మంత్రి 
పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం తప్పకుండా పరిష్కరిస్తామని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు నడపదదని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను ఇప్పటికే క్యాబినెట్‌‌లో చర్చించామని తెలిపారు. త్వరలోనే రవాణా శాఖ తరఫున కార్మిక శాఖతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఆటో కార్మికుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.ఆటో ఛార్జీలను పెంచాలని ఆటో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. 2012లో ఆటో ఛార్జీలు పెరిగాయని, దాదాపు 14 సంవత్సరాలుగా ఛార్జీల పెంపు జరగలేదన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆటో కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ప్రయాణికులపై అదనపు భారం పడకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఆర్టీసీ తరఫున ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి ఆర్టీసీనే ఆటోలు నడుపుతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఆర్టీసీకి ఎలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయదని స్పష్టంగా పేర్కొన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ, రైల్వే, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేసి ప్రయాణికులకు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను రూపొందిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -