- Advertisement -
– మాజీ ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వాన పత్రికలు
నవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడ్ గొడుగు వెంకటయ్య తన కుమారుడు చంద్రమౌళి వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను ఆహ్వానించారు. ఈ నెల 23న రాయిచేడులోని వెంకటయ్య స్వగృహంలో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించేందుకు హాజరుకావాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం మాజీ ప్రజాప్రతినిధులకు సైతం వివాహ ఆహ్వాన పత్రికలు అందజేశారు. కార్యక్రమంలో తోళ్ల ఆనంద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



