హీరో రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందు తోంది. ఫస్ట్ గ్లింప్స్, చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. విడుదల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదల కానుంది. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు శివ నిర్వాణకు మంచి పేరుంది. ఆయన ‘ఇరుముడి’ని ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు అని మేకర్స్ తెలిపారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీఓపీ : విష్ణు శర్మ, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్.
‘ఇరుముడి’ రిలీజ్ ఎప్పుడంటే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



