Monday, July 27, 2026
E-PAPER
Homeసినిమాచాలా సర్‌ప్రైజ్ ట్విస్టులతో..

చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులతో..

- Advertisement -

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. రాజశ్యామల ఎంటర్‌ టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుమంత్ మాట్లాడుతూ,'టీజర్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్నాం. సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు తప్పకుండా సంతృప్తి చెందుతారు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది అని తెలిపారు.
‘ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టీజర్‌లో చూసిన దానికంటే సినిమాలోని కంటెంట్ మరింత అద్భుతంగా ఉంటుందిఅని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పారు. నిర్మాత మధు మాట్లాడుతూ,'టీజర్‌కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కోటికి పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ విడుదలైన వెంటనే థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తయింది. దర్శకుడు సంతోష్ ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. టీజర్ ఎంత బాగుందో, ట్రైలర్, పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -