Sunday, August 2, 2026
E-PAPER
Homeదర్వాజబుద్ధి రెక్కలతో…!

బుద్ధి రెక్కలతో…!

- Advertisement -

ఇంకా విస్తరించాలి గావొచ్చు!
అయినా ఒక నమ్మకం…
ఇప్పుడే ఈ మట్టి లోపల
మొలక వేరులా మెదిలింది
మొద్దులా నిద్రపొతున్న మౌనాన్ని
బద్దలుకొట్టే పులికేక
తొందరలోనే వందలు వేలుగా
లక్షలకొద్దీ ప్రకంపనలతో పుట్టుకొస్తదని!
కాలం మీద ఇంకా కాస్త ఆశ కదిలింది
గాఢంగా అలుముకున్న ఈ మూఢ మేఘాన్ని చీల్చి
ఆకాశాన్ని కడిగే మెరుపు పిడుగొకటి పుడుతుందని
నివురు బూటు కింద నిప్పు రాజుకుంటుందని!
ఈ రాత్రి నుదిటి మీద వేల వేగు చుక్కలు
ఒక విశ్వాస గీతాన్ని రాస్తున్నాయి
బాధ్యత గల  బొద్దింకలే బుద్ధి రెక్కలతో
ఈ కుళ్లును ఊడ్చి పారేసే పొద్దొకటి
ఎర్రగా పొడుస్తుందని!
రహీమొద్దీన్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -