Magazines

నువ్వా.. నేనా ?

2 గంటల క్రితం

Is it you... or me?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

ఆ 11 సెనెట్‌ స్థానాలే కీలకం

వాషింగ్టన్‌ : అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు పోలింగ్‌ సమయం సమీపిస్తున్న తరుణంలో డెమొక్రాట్ల విజయావకాశాలపై పలు అంచనాలు వెలువడుతున్నాయి. అయితే రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లోని పలు స్థానాల్లోనే సెనెట్‌ ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. అక్కడ ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టంగా ఉంది. ఇటీవలి కాలంలో డెమొక్రాట్లు బాగా పుంజుకొని తమ ప్రభావాన్ని విస్తరించుకున్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో రాజకీయ వాతావరణం వారికే అనుకూలంగా ఉంది. సీఎన్‌ఎన్‌ తాజాగా నిర్వహించిన పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ సగటు ప్రకారం దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు, ఇరాన్‌ యుద్ధం, అవినీతి వంటి విషయాల్లో ఓటర్లలో నెలకొన్న అసహనం డెమొక్రాట్లలో ఉత్సాహాన్ని నింపింది. సిఎన్‌ఎన్‌ తాజా సర్వే ప్రకారం...సెనెట్‌లోని 11 స్థానాల్లో రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరు జరుగుతోంది. నార్త్‌ కరోలినా, ఒహియో, టెక్సాస్‌, మైన్‌, అలాస్కా, కాన్సాస్‌, లోవా, మిచిగాన్‌, న్యూ హ్యాంప్‌షైర్‌, సౌత్‌ కరోలినా, జార్జియా స్థానాల్లో పోరు తీవ్రంగా ఉంది. అనూహ్యంగా టెక్సాస్‌, కాన్సాస్‌ రాష్ట్రాలు కూడా ఇప్పుడు కీలక పోరాట వేదికలుగా మారాయి. సెనెట్‌లో మెజారిటీ సాధించాలంటే డెమొక్రాట్లు ప్రస్తుతం ఉన్న స్థానాలను నిలబెట్టు కోవడంతో పాటు రిపబ్లికన్ల నుంచి నాలుగు స్థానాలను అదనంగా కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల పోరు తీవ్రతరం కావడంతో రిపబ్లికన్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ట్రంప్‌ నెట్‌వర్క్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌ కూడా పుష్కలంగా నిధులు సమకూరుస్తున్నారు. తీవ్ర పోటీ ఉన్న 11 స్థానాల్లో డెమొక్రాట్లతో పోలిస్తే రిపబ్లికన్లే ఎక్కువ సొమ్ము వెదజల్లారు. రిపబ్లికన్లు 560 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా డెమొక్రాట్ల వ్యయం 521 మిలియన్‌ డాలర్లకే పరిమితమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్