Magazines

36 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ సేవల పునరుద్ధరణ

4 గంటల క్రితం

Microsoft services restored after 36 hours
avatar
Kalluri Elender

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్‌ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిలిచిపోయిన సేవలను దాదాపు 36 గంటల తర్వాత పునరుద్ధరించినట్లు కంపెనీ తెలిపింది. సమస్య పరిష్కారంతో ఔట్‌లుక్, టీమ్స్, ఏఐ అసిస్టెంట్‌ కోపైలట్‌ పనిచేస్తున్నట్లు పేర్కొంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గురువారం రాత్రి నుంచి మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ-మెయిల్‌ ఇన్‌బాక్సులు తెరుచుకోక.. టీమ్స్‌లో కొత్త సమావేశాలను షెడ్యూలు చేయలేక చాలామంది ఇబ్బందిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్