Tuesday, August 18, 2026
E-PAPER
Homeక్రైమ్ఉరేసుకొని యువతి ఆత్మహత్య

ఉరేసుకొని యువతి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – నర్మెట్ట 
అనారోగ్యంతో ఓ యువతి ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకున్న ఘటన మండలంలోని వెల్దండ గ్రామంలో చోటుచేసుకుంది. నర్మెట ఎస్సై నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్దండ గ్రామానికి చెందిన దామెర తిరుపతి కుమార్తె దామెర రమ్య (22) ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎంతకీ తగ్గకపోవడంతో తీవ్ర మనస్థానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -