Magazines

ముల్లును ముల్లుతోనే..!

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

వాట్సా‌ప్‌ ‌యూనివర్సిటీ నుంచి మరో నీచమైన పరిశోధన పత్రం విడుదలైంది. ఆ పత్రానికి వాళ్లే డాక్టరేట్లు, అవార్డులు, రివార్డులు ఇచ్చుకుంటారు. సమాజంపై ఎంత ద్వేషం చిమ్మితే అన్ని డాక్టరేట్లు వస్తాయన్నమాట. కానీ ఈసారి ద్వేషం చిమ్మి బోర్‌ ‌కొట్టినట్టు ఉంది. అందుకే ఆసక్తిగా ఉంటాయని వాట్సా‌ప్‌ ‌యూనివర్సిటీ కట్టుకథలు, పిట్టకథలు అల్లింది. అది ఎబ్బెట్టుగా ఉన్నా... చెప్పకతప్పదు. జేన్‌ ‌జీ, జె అల్ఫాలు, జంతర్‌ మంతర్‌లో పోరాడుతున్న వారంతా అక్రమ సంతానమంటూ వెతికి వెతికి మరో సుందరకాండను బయటకు తీసింది. దాని నుంచి వస్తున్న ఇలాంటి పరిశోధన పత్రాలను వైరల్‌ ‌చేయడం, కామెంట్లు చేయడం, లైక్‌లు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. కానీ వారికి తెలియని దేమిటంటే...వెంటనే జేన్‌ ‌జీల నుంచి దిమ్మదిరిగే కౌంటర్లు రావడంలో వారి గుబ్బగుయ్యిమంటోంది. ముల్లును ముల్లుతోనే తీయ్యాలని పెద్దలు అన్నట్టు వాట్సాప్‌ యూని‌వర్సిటీ పగిలిపోయే కౌంటర్ల మోతమోగుతోంది. నక్సలైట్లు, కమ్యూనిస్టులు అంటే ‘అవును తప్పేముంది..ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ సవాల్‌ ‌విసిరారు. అర్బన్ నక్సలైట్లు, దిమాగీ నక్సలైట్లు అంటే ‘దిమాక్‌ ఉన్నోళ్లం. అందుకే మీ కండ్లు తెరిపిస్తున్నామంటూ’ తిరుగబడ్డారు... ఇక ముందు మాస్‌ ‌జాతరే అంటూ జెన్‌ ‌ జీల కౌంటర్‌.
- గుడిగ రఘు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్