హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతే వేగంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటారు. ముక్కుసూటిగా చెప్పేస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇటీవల ఇద్దరు ఆటోడ్రైవర్ల విషయంలో ఆయన స్పందించిన తీరు దీన్ని మరోసారి రుజువు చేసింది. ఒక ఆటో డ్రైవర్ చేసిన మంచి పనికి మెచ్చిన సత్కరించారు. మరో ఆటో డ్రైవర్ చేసిన చెడు పనిని తెలుసుకుని చీత్కారించారు. అయితే ఆ రెండు విషయాల్లో ఆయన స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఆ ఆటోడ్రైవర్లు ఏం చేశారనేది ఒక్కసారి చూద్దాం... ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను సినిమా థియెటర్గా మార్చి సినిమా చూస్తూ ఆటో నడపడం పట్ల సజ్జనార్ తీవ్ర అసహనానికి గురయ్యారు. సినిమా చూస్తూ ఆటో నడిపితే జరిగే ప్రమాదం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ, సినిమా చూస్తూ... వాహనాలు నడపడం ప్రమాదమని చెప్పినా తీరు మారడం లేదనే ఆయన ఆవేదన. ఇంకో ఆటో డ్రైవర్ చేసిన సహసానికి సజ్జనార్ ఫిదా అయ్యారు. ఓ తల్లి తన బిడ్డను హుస్సేన్‌సాగర్‌లో తోసేసింది, ఆక్షణంలో ఆటో డ్రైవర్ సాగర్‌లోకి దూకి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించింది. మంచిని మంచిగా,చెడును చెడుగా చెప్పడం మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందంటే ఇదే కాబోలు... - గుడిగ రఘు






కామెంట్లు (0)