నవతెలంగాణ-హైదరాబాద్: పండ్ల రారాజుగా మామిడి పండు పేరు గావించిన విషయం తెలిసిందే. అదే విధంగా మియాజాకి అనే మామిడి పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫలంగా పేరు పొందింది. అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు విలువ కలిగి ఉంటుంది. ఒక్కో పండు ధర సుమారు రూ. లక్ష ఉంటుందని అంచనా. జపాన్‌కు చెందిన ఈ ఖరీదైన పండును ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓం ప్రకాష్ సింగ్ అనే రైతు సాగు చేశారు. రెండు సంవత్సరాల క్రితం సదురు మామిడి పండు మొక్కలు నాటగా.. ఈ సీజన్లో దాదాపు డజనుకు పైగా పండ్లు చేతికొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
మియాజాకి మామిడి పండులో మిగిలిన రకాల పండ్లతో పోల్చితే తీపి, అధిక పీచుపదార్థం, పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, అధిక మోతాదులో విటమిన్లను కలిగి ఉంటుందని రైతు తెలియజేశారు. వాటితో పాటు”థాయ్‌లాండ్‌కు చెందిన ‘బనానా మాంగో’, ఆస్ట్రేలియాకు చెందిన ‘R2E2, చౌసా, దశేరి’ వంటి భారతీయ ప్రధాన రకాలతో సహా మరికొన్ని రకాలను కూడా తాను సాగు చేస్తున్నానని సింగ్ వెల్లడించారు.అయితే మొదటగా వచ్చిన సాగును మంగళవారం అయోధ్య బాల రాముడికి కానుకగా అందజేసినట్లు చెప్పారు.



