పంచాయతీ ఈవో జాదవ్ మాధవ్..
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ ప్లేట్లు వద్దు మోదుగు విస్తరకులు ముద్దు అను నినాదంతో మంగళవారం ప్లాస్టిక్ నిషేధం పై మరియు తడి, పొడి చేత్త, శనిటేషన్ పై ప్రత్యేక శ్రద్దా తీసుకోవాలని పంచాయతీ ఈవో జాదవ్ మాధవ్ ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు అవగహన కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం మరియు పశువులు వాటిని తింటే పేగులు చెడి పోయి మరణించిన ఘంటనలు లేకపోదు దింతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. అదే విదంగా ఎవరైనా నియమ నిబంధనలు పాటించినట్లయితే పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఒక్క వెయ్యి నుంచి ఐదు వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్ వార్డ్ సభ్యులు ఉపధిహామీ కూలీలు తదితరులు ఉన్నారు.
ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



