- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
శ్రావణ శనివారం ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారి వేణు నవతెలంగాణతో తెలిపారు. శ్రావణ మూడవ శనివారం భక్తుల సందడి అధికంగా ఉందని, ఆలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పారు. స్వామివారికి ఆలయ పూజారి అరవింద్ మహారాజ్ ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయానికి మూడు రాష్ట్రాల నుండి భక్తులు భారీ సంఖ్యలో సందర్శించి, దర్శించుకున్నారని ఆలయాధికారి వేణు తెలిపారు.
- Advertisement -



