Thursday, April 16, 2026
E-PAPER
Homeఖమ్మంవృద్ధాప్యం నిలువెత్తు అనుభవం

వృద్ధాప్యం నిలువెత్తు అనుభవం

- Advertisement -

– పెద్దలకు తోడుగా ఉందాం
– అనువంశిక వైద్యురాలు సుధారాణి
నవతెలంగాణ – అశ్వారావుపేట

“వృద్ధాప్యం అంటే వయసు మల్లటం కాదు అని,అది నిలువెత్తు అనుభవం” అని అనువంశిక వైద్యులు,సత్తుపల్లి స్వచ్ఛంద సేవకురాలు ,హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్,కొనకళ్ళ సుధారాణి అన్నారు. మండలంలోని దురదపాడు లో మానవత్వానికి ప్రతీకగా నిలిచే సేవా కార్యక్రమాన్ని ఆమె గురువారం నిర్వహించారు.. పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న 30 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కదలేని స్థితిలో ఉన్న వృద్ధుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వారితో మాట్లాడి అవసరాలను తెలుసుకుని సహాయం అందించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. వృద్ధుల పట్ల మమకారం,గౌరవం చూపడం సమాజ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

 వృద్ధులను చీత్కారించడం వారి మనసుకు గాయ పడేలా చేసి, ఆత్మన్యూనతకు దారి తీస్తుందని హెచ్చరించారు.అందుకే వారిని ప్రేమతో ఆదరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆమె సూచించారు. ఈ సేవా కార్యక్రమం గ్రామస్థుల్లో చైతన్యం నింపడం తో పాటు, వృద్ధుల పట్ల మనస్పూర్తిగా ఆలోచించే అవసరాన్ని గుర్తుచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -