Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు

- Advertisement -

సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంలొనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని,పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పథకాలు అంధకపొగా రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని తాడిచెర్ల బండి స్వామి ఆరోపించారు. గురువారం తాడిచెర్ల రైతువేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి గ్రామ సభ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మాట్లాడారు సిఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి అనేక నిదులు తెచ్చారని,గత పాలకులు చెసిన అప్పులను సైతం తీర్చారని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు ఆందోళనకు గురికావద్దని చెప్పారు. గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ,గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,మాజీ ఎంపిపి మలహల్ రావు,ఎంపిడిఓ శ్రీరామూర్తి,తహశీల్దార్ రవికుమార్,ఏవో శ్రీజ, సర్పంచ్లు బండారి నర్సింగం,కొండ రాజమ్మ,గడ్డం క్రాoతి,మేకల రాజయ్య,అబ్బినేని లింగస్వామి,చంద్రగిరి సంపత్,ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్,తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు సారయ్య,తిర్రి అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -