Friday, April 17, 2026
E-PAPER
Homeసినిమామెస్మరైజ్‌ చేసే 'రావు బహదూర్‌'

మెస్మరైజ్‌ చేసే ‘రావు బహదూర్‌’

- Advertisement -

దర్శకుడు వెంకటేష్‌ మహా దర్శకత్వంలో సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రావు బహదూర్‌’. ఈ చిత్రాన్ని ఏంఎస్‌ మూవీస్‌, శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈచిత్రాన్ని సమర్పిస్తోంది.
దర్శకుడు వెంకటేష్‌ మహా మాట్లాడుతూ,’ఒక రోజు కీరవాణి ఫోన్‌ చేసి ‘మళ్లీ నీ సినిమా చూడాలని ఉంది, మరో సినిమా తీయవా?’ అని అడిగారు. అదే రోజు అనురాగ్‌, శరత్‌ కూడా ఫోన్‌ చేసి నా విజన్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. మహేష్‌ బాబు, నమ్రత కథ విని ఓకే చెప్పగానే మేము మొదలుపెట్టాం. గోపాలకష్ణ రావడంతో పని ఇంకా సులభమైంది. సత్య నా క్రియేటివ్‌ సోల్‌ మేట్‌. దీప ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క నటుడు అద్భుతంగా చేశారు. స్మరణ్‌ సాయి సంగీతం సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది. ‘ఓ సుందరి’ పాట దానికి నిదర్శనం. ‘కేర్‌ ఆఫ్‌ కంచరపాలెం’ సినిమా మీకు ఇచ్చిన అనుభూతికి పది రెట్లు అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను. ఈ సినిమా మీ అందరికీ మంచి థియేట్రికల్‌ అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు. ‘మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, అవతార్‌ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే మిమ్మల్ని కూర్చోబెట్ట గలిగాయో మా సినిమా కూడా మిమ్మల్ని అంతే స్థాయిలో అలరిస్తుంది. ఇది నా ప్రామిస్‌. ఈ సినిమా మీ అందరినీ మెస్స్మరైజ్‌ చేస్తుంది. ఇది నా హామీ. వెంకటేష్‌ మహా ఒకసారి మాటిస్తే తప్పే రకం కాదు. దేశం మొత్తం తిరిగి ఈ కథ రాశాడు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -