Friday, April 17, 2026
E-PAPER
Homeసినిమా'లెనిన్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లెనిన్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

హీరో అఖిల్‌ అక్కినేని లేటెస్ట్‌ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన తొలి సాంగ్‌ ‘వారేవా వారేవా..’కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. తమన్‌ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సాంగ్‌తో మూవీ ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండో పాట విడుదలైంది. చక్కటి మ్యూజిక్‌ ట్రాక్‌తో ఈ పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ జోష్‌తో నిండిన డాన్స్‌ మెలోడీ క్యాచీ బీట్స్‌, ఎనర్జీతో మెప్పిస్తోంది. అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్‌. అఖిల్‌ తన మాస్‌ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. ఈ ఇద్దరి జోడీని స్క్రీన్‌పై చూస్తుంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. తనదైన సిగేచర్‌ హుక్స్‌, బీట్స్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాస్‌ మెలోడీని అద్భుతంగా కంపోజ్‌ చేశారు. సింగర్‌ శ్రీకష్ణతో కలిసి తమన్‌ ఈ పాటను పాడటం విశేషం. భాస్కరభట్ల ట్యూన్‌కు తగ్గట్టు చక్కటి సాహిత్యాన్ని అందించారు. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రం జూన్‌ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేలా మేకర్స్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -