నవ తెలంగాణ-మల్హర్ రావు.
కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఇందారపు చెంద్రయ్యను నియామకం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు.ఎన్నికైన చెంద్రయ్యను బుధవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు శాలువాతో సత్కరించారు. చెంద్రయ్య గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవకు గుర్తింపుగా,పలుమార్లు వార్డు సభ్యుడిగా,ఉప సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు అందింస్తున్న సేవకు గుర్తింపుగా, తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం చేసిన రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుకు,ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డికి,ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,మాజీ ఎంపిపి మలహల్ రావు,మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,స్థానిక సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు తోపాటు జిల్లా,మండల కార్యవర్గానికి చెంద్రయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇందారపు చెంద్రయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


