ఆర్టీఐ కార్యవర్గ సభ్యుడు బండి సుధాకర్ ఆరోపణ
నవ తెలంగాణ-మల్హర్ రావు.
తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్ ఇండ్ల సర్వేలో అవకతవకలు జరిగాయని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ మండల కార్యవర్గ సభ్యుడు బండి సుధాకర్ ఆరోపించారు.గురువారం తాడిచెర్లలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ కార్యక్రమంలో భాగంగా సుధాకర్ మాట్లాడారు 2022 సంవత్సరం పిఎన్ పబ్లికేషన్ ప్రకటన ప్రకారం డేంజర్ జోన్లో ఉన్న ప్రతి ఇంటి నిర్వాసితునికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.నిర్వాసితులకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమన్నారు.గతంలో ఇంటి పరిహారం,ఆర్అండ్ ఆర్ ప్యాకేజి పొందిన కొందరికి ఇందిరమ్మ మంజూరు కావడం జరిగిందని,పేదలకు మాత్రం ఇండ్లు రాలేదు వాపోయారు.అధికారుల తప్పిదాలతో డేంజర్ జోన్లో స్థానికులకు అన్యాయం,స్టానికేతరులకు న్యాయం జరిగేలా ఉందన్నారు.జెన్కో అధికారులు ఇంటి నెంబర్ వేసిన ప్రతి ఇంటికి పరిహారం ఇవ్వాలని కోరారు.జీపీ రికార్డులు,నివాస యోగ్యమైన ఇండ్లను గుర్తించాలన్నారు.ఉన్నతాధికారులు పట్టించుకోని ఎపి జెన్కో, టిఎస్ జెన్కో పేరుతో వేసిన ఇంటి నెంబర్లు సరిచేసి అందరికి పరిహారం,ప్యాకేజి,పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.



